మహిళా తాసిల్దార్ వనజాక్షి పై విప్‌, అనుచరుల దాడి

తహశీల్దారుపై విప్‌, అనుచరుల దాడి
అక్రమ ఇసుక రవాణాను అడ్డుకున్న ఫలితం
ప్రజాశక్తి – ముసునూరు
కృష్ణాజిల్లా బలివే గ్రామ పరిధిలోని తమ్మిలేరులో అక్రమంగా తరలిస్తున్న ఇసుక రవాణాను అడ్డుకున్న తహశీల్దారు డి.వనజాక్షి, రెవెన్యూ సిబ్బందిపై రాష్ట్ర ప్రభుత్వ విప్‌, పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకరరావు, ఆయన అనుచరులు విక్షణారహితంగా దాడిచేశారు.
మహిళా అధికారి అనే గౌరవం కూడా లేకుండా అసభ్యకర పదజాలంతో దూషించారు. ఈ దాడిలో ఆమె శరీరమంతా గాయాలయ్యాయి. తహశీల్దార్‌ కార్యాలయం కంప్యూటర్‌ ఆపరేటర్‌ సురేష్‌ చెయ్యి గూడ జారిపోయింది. విఆర్‌ఓలపై కూడా దాడి జరిగింది.
అనుమతి లేకుండా ఇసుక రవాణా ఎలా చేస్తారని ఎమ్మెల్యే అనుచరులను తహశీల్దార్‌ నిలదీశారు. ఈ విషయం తెలిసిన వెంటనే చింతమనేని ప్రభాకరరావు తన అనుచరులతో అక్కడికి వచి దాడికి పాల్పడ్డారు. ప్రభుత్వ విప్‌ అయి ఉండి చట్టాలను గౌరవించాల్సింది పోయి ఒక వీధి రౌడీలాగా ప్రవర్తించడం దారుణమని, ఈ దాడి వెనుక ఏలూరు ఎంపీ హస్తం కూడా ఉందని పలువురు విమర్శిస్తున్నారు.
కొన్ని అక్రమ కట్టడాల కోసం అక్రమంగా ఇసుకను తరలిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బాధ్యతాయుతమైన అధికారిపైన దాడిచేసిన చింతమనేని ప్రభాకరరావును ప్రభుత్వ విప్‌ పదవి నుండి తొలగించాలని, ఆయనను తక్షణమే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని అధికారులు, ఉద్యోగులు డిమాండ్‌ చేస్తున్నారు.


Source:Prajasakti
Share on Google Plus

About Unknown

This is TeluguSongsZ.Net.We are here to get lot of updates in Telugu Movies, News, Song Downloads "Stay on iTelugu and TeluguHub " Thank You for Visiting us.
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment