
అసలు కాల్ మని స్కాం వ్యవహారం బయటికి ఎలా వచ్చింది?
కాల్ మనీ బయటపెట్టిందెవరు అన్నదానిపై విజయవాడలో చాలా చాలా గుసగుసలు విన్పిస్తున్నాయి.తెలుగుదేశం పార్టీలోని కొందరు నేతలు కాల్ మనీ వ్యవహారంపై మీడియాకు లీకులు ఇస్తున్నారని తెలుస్తోంది.మొత్తం కాల్ మనీ అంశం తెరమీదకు రావడానికి ప్రధాన కారకుడు విజయవాడ ఎంపీ కేశినేనియే కారణమని టిడిపిలో ఓ వర్గం భావిస్తోంది.
.తనను ఎమ్మెల్యే ఉమా, బుద్దా వెంకన్న, దేవినేని ఉమా తదితరులు పట్టించుకోవడం లేదని భావించి కేశినేని కాల్ మనీ అంశాన్ని తెరమీదకు తీసుకువచ్చారని ఆరోపిస్తున్నారు.అయితే చిన్నగా ఉంటుందనుకున్న నాని ఇంత స్థాయిలో రియాక్షన్ ఉంటుంది..ప్రభుత్వానికే ఇబ్బందులు తలెత్తుతాయని ఊహించలేకపోయారని నాని అనుచరులు కొందరు సర్దిచెప్పే ప్రయత్నం చేస్తున్నారట..విజయవాడలో భగ్గుమంటున్న ఇరువర్గాలు తగాదాలు చంద్రబాబు దృష్టికి వెళ్లిందని, వీరిపై కూడా సీరియస్ గానే వ్యవహారం ఉంటుందని కొందరు నేతలు చెప్పుకుంటున్నారు..
0 comments:
Post a Comment