
జగన్ మితిమీరి ప్రవర్తిస్తే పట్టించుకోవద్దు
ఎపి మంత్రి వర్గ సమావేశంలో కాల్ మనీ ,సెక్స్ రాకెట్ పై జరిగిన చర్చలో వచ్చిన విషయాలు ఒక్కో మీడియాలో ఒక్కో రకంగా ఉన్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసెంబ్లీ గురించి ప్రస్తావిస్తూ జగన్ కోసం కాకుండా జనం కోసం ప్రభుత్వం జవాబులు ఇవ్వాలని అన్నారని ఈనాడు కధనంగా ఉంది.మితిమీరిన ప్రవర్తనతో జగన్ మాట్లాడినా దానిని పట్టించుకోవనసరం లేదని ఆయన అన్నారు. గౌతం సవాంగ్ సెలవుపై వెళ్లడాన్ని కూడా వైఎస్ ఆర్ కాంగ్రెస్ రాజకీయం చేసిందని చంద్రబాబు వ్యాఖ్యానించారు.సవాంగ్ కుమార్తె విదేశాలలో ఉండడంతో అక్కడకు వెళ్లి క్రిసమస్ జరపుకోవాలని అనుకున్నారని, ఆయన టిక్కెట్లు చూసినా ఈ విషయం తెలుస్తుందని చంద్రబాబు అన్నారు.బాక్సైట్ ఒప్పందాలు వైఎస్ హయాంలోనే జరిగాయని చెప్పాలని ఆయన సూచించారు.Source - Kommineni Info
0 comments:
Post a Comment